Sunday, March 22, 2026

అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవు

  • పేరూరు ఎస్ఐ జి. కృష్ణ ప్రసాద్

నేటిసాక్షి /వాజేడు : ములుగు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫిబ్రవరి 15 శనివారం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉన్న రాంపూర్, భీమారం ఇసుక క్వారీలను రెవెన్యూశాఖ వారితో కలసి పేరూరు ఎస్.ఐ.,జి.కృష్ణ ప్రసాద్ సందర్శించారు. ఇసుక క్వారిలోని రవాణా ధారులకు క్వారీ యాజమాన్యానితో జి. కృష్ణ ప్రసాద్ ఎస్ఐ పేరూరు మాట్లాడుతూ పలు హెచ్చరికలు జారచేశారు. లారీల వాహన దారులకు సరియగు డీడీ లు లేకుండా ఒక లారికి బధులు మరో లారీ లో ఇసుక తరీలంచినా, సూచించిన మేరకు కాకుండా అధిక లోడ్ తరలించిన క్వారీ నిర్వహించు యాజమాన్యం వారు ప్రభుత్వ సూచనలను ఉల్లంగించిన జెసిబి ల లోడింగ్ ఛార్జీలు వసూలు చేసిన ఇతరత్రా అక్రమాలకు పాల్పడిన వారి పై చట్టరీత్యా తగు కఠిన చర్యలు తీసుకోబడునని హెచ్చరించారు. ఎవరైనా సరే ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సిందే నని తెలియ జేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News