Friday, March 20, 2026

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం

  • గ్రామస్తులను అభినందించిన ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి

నేటిసాక్షి ప్రతినిధి, చందుర్తి ( సతీష్ ): నేరాల నియంత్రణ, కేసులు ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని ఏ ఎస్ పి శేషాద్రిని రెడ్డి అన్నారు. శనివారం చందుర్తి మండలం మరిగడ్డ గ్రామంలో పోలీసులు, గ్రామ ప్రజల సహకారంతో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాలు ఏర్పాటుకు సహకరించిన గ్రామ ప్రజలను ఏఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా ఏఎస్పి శేషాద్రి శేషాద్రిని రెడ్డి మాట్లాడుతూ… ఒక సీసీ కెమెరా వంద మంది పోలీస్‌ సిబ్బందితో సమానమని, సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు నియంత్రించ వచ్చన్నారు. మరిగడ్డ గ్రామ ప్రజలను ఆదర్శంగా తీసుకొని ఇతర గ్రామాల ప్రజలు కమిటీలు వేసుకొని సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని, అన్ని గ్రామాల్లో విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. స్వీయ రక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. యువత అసాంఘిక కార్యాకలాపాలకు దూరంగా ఉండాలని, గంజాయికి అలవాటు పడి బంగారు భవిష్యత్‌ నాశనం చేసుకోవద్దని అన్నారు. వారిని సక్రమమైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. మహిళలకు, బాలికలకు ఏమైనా ఇబ్బందులు తలేత్తితే డయల్‌ 100, షీటీమ్‌కు సంప్రదించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ విధిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్నారు. ఏఎస్పీ శేషాద్రిని వెంట చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ అంజయ్య, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News