Friday, March 20, 2026

గిరిజనుల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్‌ మహారాజ్

  • మండలంలో భారీ ర్యాలీలు నిర్వహించిన గిరిజనులు
  • జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
  • రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి

నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి ( కోక్కల వంశీ ) : మహనీయుల ఆలోచనలను తీసుకొని యువత ముందుకు పోవాలని ప్రభుత్వవిప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం బడి తండాలో సంత్ శ్రీశ్రీశ్రీ సేవాలాల్ మహారాజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంతు సేవాలాల్ మహారాజ్ 286 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి తో కలసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ… బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ సేవలు చీరస్మరణీయమని, గిరిజనుల అభివృద్ధి కోసం ఎన్నో త్యాగాలు చేసిన సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ప్రతి ఏటా నిర్వహించుకోవడం అభినందనీయమని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రభుత్వం తరఫున సంతు సేవాలాల్ జయంతి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మహనీయుడు 286 సంవత్సరాల క్రితం జన్మించి గిరిజనులకు ఒక ఆరాధ్య దైవంగా మారారని,వారు చెప్పిన విధంగా మంచిని స్వీకరించి చెడును విడిచిపెట్టాలని అన్నారు. మహనీయాల ఆలోచనలు తీసుకొని నేటి యువత జీవితంలో ముందుకు పోవాలని,దారి తప్పుతున్న సమాజానికి మహనీయుల జయంతి ఒక దిక్సూచిగా మారతాయని అన్నారు. గిరిజనులకు సంబంధించిన హక్కులను రక్షించడానికి ప్రభుత్వం ముందు ఉంటందని,సంత్ సేవాలాల్ మహారాజ్ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనీ చెప్పినట్లుగా అనుసరిస్తూ ప్రజా ప్రభుత్వంలో గంజాయి రహిత రాష్ట్రంగా మారడానికి కృషి చేస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ జాతి ఐక్యత అభివృద్ధి కోసం కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చేలకల తిరుపతి, బడి తండా వీడిసి చైర్మన్ మదన్, వైస్ చైర్మన్ రాందాస్, అంబర్ సింగ్, తిరుపతి, బంకట్ లాల్,రమేష్, మహేందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తూమ్ జలపతి, కొమ్ముల రవీందర్ రెడ్డి, తూము రవీందర్, జక్కు మోహన్, జక్కు వంశీ, దాసరి అశోక్, లింగారెడ్డి, గజన్ లాల్, కొండ రాజేందర్ , జక్కల లక్ష్మీ నర్సయ్య, అల్లూరి రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News