నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : ఆకస్మికంగా మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి పోలీస్ భద్రత నుండి మంజూరైన చెక్కును వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శనివారం అందజేసారు. వివరాల్లోకి వెళితే నర్సంపేట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న జనార్దన్ గత సంవత్సరం సెప్టెంబర్ 7 వ తేదిన అనారోగ్యం తో మరణించాడు. దీనితో తెలంగాణ పోలీస్ భద్రత పథకం ద్వారా మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి మంజూరు చేసిన 7లక్షల 89 వేల ల రూపాయల చెక్కులను పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా మరణించిన కానిస్టేబుల్ సతీమణి లీలకు అందజేసారు, ఈ సందర్భంగా మరణించిన కానిస్టేబుల్ కుటుంబ స్థితిగతులపై ఆరా తీయడంతో పాటు, శాఖపరంగా రావల్సిన బెనిఫిట్లను అందజేసేందుకు తక్షణ చర్యలు గైకొనాల్సిందిగా పోలీస్ కమిషనర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్య క్రమములో అదనపు డీసీపీ రవి, పరిపాలన విభాగం ఏవో రామకృష్ణ స్వామి, సెక్షన్ సూపరింటెండెంట్ రమాదేవి, సహాయ సిబ్బంది శ్రవణ్ పాల్గోన్నారు.





