Friday, March 20, 2026

డి 83/ఎ కాలువ ద్వారా నీరు విడుదల

  • నేటి సాక్షి వార్త కథనానికి స్పందన

నేటి సాక్షి, ఎండపల్లి(రియాజ్): సాగు నీరు మళ్ళింపుపై ఆందోళన వార్త కథనం ఆదివారం ప్రచురితమైన దానిపై ఎస్ఆర్ఎస్పీ అధికారులు స్పందించారు. రంగదాముని పల్లి మినీ రిజర్వాయర్ నుండి ఆదివారం ఎస్ఆర్ఎస్పీ అధికారుల ఆదేశాలతో సిబ్బంది డి 83/ఎ కాలువ గేట్లు ఎత్తి నీరు విడుదల చేశారు. ఉదయం కాలువ గేట్ గేర్ బాక్స్ ను బిగించి, రిజర్వాయర్ లో 12 పీట్ల మేర ప్రస్తుత నీటి మట్టం ఉండగా చివరి ఆయకట్టుకు సాగు నీరు అందేలా రైతులు, నాయకులతో కలిసి విడుదల చేశారు. అదేవిధంగా జంగల్ నాళ ప్రాజెక్టు కు అక్రమ నీరు తరలిస్తున్నారన్న ఆరోపణలతో తాత్కాలికంగా అటుగా నీరు నిలిపివేశారు. అయితే డి 83/ ఎ కాలువపై ఆధారపడి సుమారు ఏడు వేల ఏకారాలు ఆయకట్టు (అంబారిపేట, ఎండపల్లి, కొండాపూర్, గుల్లకోట, చర్లపల్లి, ఆత్మకూరు, దమ్మన్నపేట) గ్రామాలు ఉన్నందున పంటలకు సరిపడ నీరు అందలాంటే వారం పాటు సరపర సాగించాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటికే అక్కడక్కడ నీరు అందక పొలాలు ఎండిపోయో పరిస్థితి ఏర్పడిందని దీనిని దృష్టిలో ఉంచుకుని ఎస్ఆర్ఎస్పీ ఆధికారులు నిరంతర పర్యవేక్షణతో సాగు నీరు వృధా కాకుండా అక్రమ తరలింపును అడ్డుకుని పంటలకు సక్రమంగా నీరు అందేలా చొరవ చూపాలని, కాగా ప్రస్తుత పరిస్థితిపై స్పందించి డి 83/ఎ కాలువ ద్వారా నీరు విడుదల చేసిన ఎస్ఆర్ఎస్పీ అధికారులకు, సిబ్బందికి రైతులు, నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు సిగిరి ఆనంద్, జెల్ల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాదాసు గంగాధర్, రైతులు ఆదే మల్లయ్య, సిగిరి మహేష్, ఎస్ఆర్ఎస్పీ సిబ్బంది సదానందం తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News