Friday, March 20, 2026

కేసిఆర్ గారి జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలి

  • వృక్షార్చన పోస్టర్ విడుదల చేసిన మాజీ జడ్పీటీసీ, జోగులాంబ గద్వాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకులు బాసు శ్యామల, నుమంతు నాయుడు

నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : ఈ నెల ఫిబ్రవరి 17వ తారీఖున అనగా రేపు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు సందర్భంగా గద్వాల నియోజకవర్గంలోని బాసు హనుమంతు నాయుడు గారి నివాసం నందు వారి చేతుల మీదుగా వృక్షార్చన పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా బాసు హనుమంతు నాయుడు మాట్లాడుతూ.. మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ( హరిత సేన వృక్షార్చన ) కార్యక్రమంలో మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యుల తన జన్మదినం సందర్భంగా ఈ నెల 17వ తారీఖున అనగా రేపు గద్వాల నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటలని పిలుపునిచ్చారు. మన కేసిఆర్ హరిత హారంతో రాష్ట్రాన్ని మంతటా మొక్కలు నాటి రాష్ట్రాన్ని పచ్చగా చూడాలని ఎంతో కృషి చేశారని వారు తెలిపారు. ఇప్పుడు కూడా వారి జన్మదినం పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి నాటిన తేది : 17 – 2 – 2025 నా 9000365000 నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపాలని బాసు హనుమంతు నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్దకల్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు డి.శేఖర్ నాయుడు, గంజిపేట రాజు, శ్రీ రాములు, తిరుమలేష్, తిమ్మప్ప గౌడ్, కొత్తపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, బీచుపల్లి, జి. వెంకటేశ్వర్ రెడ్డి, వీరేష్ గౌడ్, చిన్న యాదవ్, నియోజకవర్గ BRSV అధ్యక్షుడు ఎండి.మాజ్, బాలస్వామి,రమేష్, సత్యాన్న,పూడూరు అంజి, జాన్ మరియు పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News