Friday, March 20, 2026

మనస్థాపానికి గురైన ఇల్లు వదిలి వచ్చిన మహిళ

  • మహిళను కాపాడిన తిరుపతి మహిళా పోలీసులు
  • కుమారుడు, కోడలు తనవలన పడుతున్న గొడవలు తట్టుకోలేక బెంగళూరు నుండి తిరుపతికి వచ్చిన వృద్ధురాలు

నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., ఆదేశాల మేరకు ఈస్ట్ మరియు వెస్ట్ మహిళా రక్షక్ మహిళా పోలీస్ సిబ్బంది వారు ఆర్టీసీ బస్టాండ్ నందు మూవింగ్ చేస్తున్న సమయంలో వాళ్లకు ఒక వృద్ధురాలు ఏడుస్తూ కనిపించింది. ఆ వృద్ధురాలిని మహిళ పోలీస్ సిబ్బంది విచారించగా తన పేరు రాజేశ్వరమ్మ వయసు 72 సంవత్సరములు, నా భర్త లేట్ కె. వెంకట మునిశెట్టి, చిరునామా సుభాష్ నగర్, మూలస్థానమ్మ అమ్మవారి టెంపుల్ తిరుపతి అని చెప్పింది. తన కుమారుడు బెంగళూరులో నివాసం ఉన్నందున గత కొంతకాలంగా వృద్ధురాలు కూడా బెంగళూరులోనే ఉండేది. అక్కడ ప్రతిరోజు తన కుమారుడు మరియు కోడలు తనపై గొడవ పడుతున్నారని అది భరించలేక ఆమె నిన్నటి ఉదయం 15.2.2025 న బెంగళూరు నుండి తిరుపతికి వచ్చి ఎక్కడికి వెళ్లాలో ఏం చేయాలో తెలియక ఆర్టీసీ బస్టాండ్ నందు ఉన్నాను అని చెప్పింది. తన కొడుకే ప్రతిరోజు ఇలా గొడవ పడుతున్నందుకు చాలా కష్టంగా ఉంది, వెళ్లి చనిపోవాలి అని ఏడుస్తూ చెప్పింది. అలా చెప్పగా వెంటనే మహిళ రక్షక్ వారు వృద్ధురాలికి ధైర్యం చెప్పి ఆమెను రక్షక్ మొబైల్ వెహికల్ నందు తీసుకొని అలిపిరి రోడ్డు నందు గల శ్రీ పద్మావతి వృద్ధాశ్రమం నందు చేర్పించడం జరిగింది. ఆదివారం ఉదయం మహిళ రక్షక సిబ్బంది వృద్ధురాలి దగ్గర చిరునామా సేకరించి తన కుమార్తె సృజన కు రాజేశ్వరమ్మను అప్పగించారు. మానవత్వంతో కూడిన తమ విధులను నిర్వర్తించడం హర్షణీయం అంటూ ఈస్ట్ అండ్ వెస్ట్ మహిళా రక్షక్ మహిళా పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,  అభినందించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News