Saturday, March 21, 2026

మహేశ్వరంగడ్డపై కేసీఆర్ జన్మదిన వేడుకలు

  • ఘనంగా తెలంగాణ జాతి పిత కేసీఆర్ జన్మిందిన వేడుకలు

నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం (చిక్కిరి శ్రీకాంత్): మాజీ మంత్రి మాహేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి ఆదేశానుసారం మహేశ్వరం మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అంగోత్ రాజు నాయక్ అధ్యక్షతన, పి.ఏ.సి.ఎస్ చైర్మన్ మంచే.పాండు యాదవ్,వైస్ చైర్మన్ దేవరంపల్లి. వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో.. తెలంగాణ రాష్ట్ర ప్రదాత, బంగారు తెలంగాణ నిర్మాత, జన హృదయ నేత, తెలంగాణ జాతి పిత, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన కార్యక్రమాలలో భాగంగా అంబేద్కర్ చౌరస్తాలో కేసీఆర్ చిత్రపటానికి పులమాల వేసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మహేశ్వరం సి.హెచ్.సి గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణంలో మొక్కలు నాటి,రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బి.ఆర్.యస్ పార్టీ ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు, బి.ఆర్.యస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News