Saturday, March 21, 2026

దివ్యాంగులకు సహాయకంగా ఉపకరణాల పంపిణీకి చర్యలు

  • జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- జిల్లాలోని దివ్యాంగులకు ఉపయోగపడే విధంగా జిల్లా మహిళ, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ, అలింకో సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో సహాయ ఉపకరణములను ఉచితంగా పంపిణీ చేసేందుకు అర్హులైన వారిని ఎంపిక చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్లో జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్, అలింకో సంస్థ ప్రస్తేటిస్ట్ ఆర్థోటిస్ట్ వైద్యులు డా, సునీత సుభాదర్శిని దాస్ లతో కలిసి 4 రకాల వైకల్యాలు కలిగిన దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు పంపిణీ చేసేందుకు అర్హుల ఎంపిక కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, దివ్యాంగత్వ శాతం, అర్హతను బట్టి దివ్యాంగులకు అవసరమైన సహాయ ఉపకరణాలు అందించడం జరుగుతుందని తెలిపారు. దివ్యాంగులు ఈ కార్యక్రమానికి హాజరై వారి వివరాలు నమోదు చేసుకున్నారని, ఎంపిక ప్రక్రియ పూర్తి అయిన తరువాత అలింకో సంస్థ ద్వారా వారికి కావలసిన ఉపకరణములు త్వరలోనే అందజేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ శిబిరంలో దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భోజనం, మజ్జిగతో పాటు త్రాగునీరు, హెల్ప్ డెస్క్, రిజిస్ట్రేషన్ కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఫిబ్రవరి 18వ తేదీన చెన్నూరు పట్టణంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్, బెల్లంపల్లి, తాండూర్, కాసిపేట, నెన్నెల, భీమిని, కన్నెపల్లి, మందమర్రి రూరల్, అర్బన్ ప్రాంతాల వారికి ఫిబ్రవరి 19వ తేదీన బెల్లంపల్లి పట్టణంలోని పద్మశాలి భవన్ సమీపంలో గల సింగరేణి కళావేదిక, లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల వారికి ఫిబ్రవరి 20వ తేదీన లక్షెట్టిపేట మండల కేంద్రంలోని రైతు వేదిక (వ్యవసాయ మార్కెట్ యార్డు)లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. శారీరక దివ్యాంగులకు బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్, మూడు చక్రాల రిక్షా, వీల్ చైర్, చంక కర్రలు, చేతి కర్రలు, బదిరులకు (మూగ, చెవిటి) శ్రవణ యంత్రాలు, అంధులకు ప్రత్యేక మొబైల్ ఫోన్లు, చేతి కర్రలు, మానసిక దివ్యాంగులకు ప్రత్యేక కిట్లు అందించడం జరుగుతుందని తెలిపారు. నిర్ణీత తేదీలలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ మంచిర్యాల ప్రాజెక్టు సిడిపిఓ విజయలక్ష్మి, సూపర్వైజర్స్, అలింకో సంస్థ ప్రతినిధులు, ఫీల్డ్ రెస్పాన్స్ అధికారి ఎండి. ఫర్జానా బేగం, జిల్లా బాలల సంరక్షణ అధికారి ఆనంద్, సఖి సిబ్బంది, డి. హెచ్ఈడబ్ల్యు, చైల్డ్ లైన్ సిబ్బంది, సంబంధిత అధికారులు, దివ్యాంగులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News