Saturday, March 21, 2026

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్య మంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు

  • ఘనంగా జరిపిన గౌరవ ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు శ్రీమతి కోవ లక్ష్మి

నేటి సాక్షి, కొమురం భీం: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ కార్యాలయంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి మొక్కలు నాటి ఘనంగా నిర్వహించిన గౌరవ ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు శ్రీమతి కోవ లక్ష్మి గారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత, అలుపెరగని సేవకుడు, తెలంగాణ రాష్ట్ర అభవృద్ధి ప్రదాత అని కేసీఅర్ గారిని అన్నారు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి పాలనలో అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News