నేటి సాక్షి, కొడిమ్యాల : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం లో ఎప్పుడు పెషేంట్లతో తీరికలేకుండ వుండే శ్రీబాలాజీ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ జగదీప్ MBBS ఆదివారం గుడిపెల్లి రాజు అనే పెషేంట్ ఆపదలో వున్నారు అని మేమున్నాము స్వచ్చంద సంస్థ అధ్యక్షులు మొగిలిపాలెం శ్రీనివాస్ ద్వారా తెలుసుకుని రాత్రి అనికూడా చూడకుండా కొడిమ్యాల ప్రాంతానికి చెందిన గుడిపెల్లి రాజు రక్తహీనతతో జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్ లో సీరియస్ గా వున్నారు. అని జగిత్యాల ప్రభుత్వ ఆరోగ్యకేంద్రానికి వెళ్లి రక్తదానం చేయడం జరిగింది మేమున్నాము స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షులు మొగిలిపాలెం శ్రీనివాస్ ఇప్పటివరకు వెయ్యి మంది రోగులకు వారి సంస్థ ద్వారా రక్తదానం చేశారని పెషేంట్ కుటుంబ సభ్యులు డాక్టర్ జగదీప్. శ్రీనివాస్ లకు కృతజ్ఞతలు తెలిపారు.





