నేటి సాక్షి, మహబూబాద్ నరసింహ పేట భూక్యా రవి : జిల్లాలోని గూడూరు మండల కేంద్రంలో ఉన్న తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్, మహాత్మ జ్యోతిరావు పూలే హాస్టల్ (బాలికలు) లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వసతి గృహంలోని కిచెన్ షెడ్, స్టోర్ రూమ్, డైనింగ్ హాల్, స్టడీ రూమ్, టాయిలెట్స్, తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, రాత్రిడిన్నర్, మెనూ ప్రకారం పక్కాగా అమలు చేయాలని నాణ్యమైన ఆహార పదార్థాలను వెంట వెంటనే తయారుచేసి అందించాలన్నారు. విద్యాసంస్థలలో ఉత్తమ ప్రతిభ కనబరచడానికి ప్రతి సబ్జెక్టుల వారిగా ప్రత్యేక శ్రద్ధ వహించి పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్య బోధనలు అందించాలన్నారు. పిల్లలకు షెడ్యూల్ ప్రకారము వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. వారి యొక్క వ్యక్తిగత వివరాలు, ఆరోగ్య విద్య విషయాలపై ప్రతినిత్యం గమనిస్తూ ఉండాలని వార్డెన్స్, సంబంధిత వెల్ఫేర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పిల్లలతో స్వయంగా మాట్లాడుతూ సబ్జెక్టుల వారిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. పట్టుదలకు చదివి మంచి ఫలితాలు సాధించాలని వారికి సూచించారు. భోజనం సిద్ధం చేసే సిబ్బంది తగిన జాగ్రత్తలు పాటిస్తూ భోజనం సిద్ధం చేయాలన్నారు. వసతి గృహాల పరిసరాలలో సానిటేషన్ చేస్తూ పరిశుభ్రముగా ఉంచుకోవాలని సూచించకలెక్టర్ వెంట స్థానిక తహసిల్దార్ శ్వేత, మండల పరిషత్ అభివృద్ధి అధికారి వీరస్వామి, సంబంధిత సిబ్బంది ఉన్నారు.





