Saturday, March 21, 2026

మండల కేంద్రంలో కేసిఆర్ జన్మదిన వేడుకలు

నేటిసాక్షి, వేమనపల్లి; వేమనపల్లి మండల కేంద్రంలో బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోలి వేణు మాధవరావు ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి, స్వీట్స్ పంపిణీ చేసారు. అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు,బ్రెడ్ పంపిణీ చేశారు. నాగారం గ్రామంలో గ్రామ అధ్యక్షులు దొంతుల సత్యనారాయణ ఆధ్వర్యంలో మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ కుబిడే వెంకటేశం, సీనియర్ నాయకులు పురాణం లక్ష్మీకాంత్, యువ నాయకులు ఉప్పలపు సాయి, మాజీ సర్పంచులు కుబిడే మధుకర్, గొంతు మేర, కొండగొర్ల బాపు, బెడ్డల రాజలింగు, బోర్కుటి సంతోష్, జెల్ల మొండి, పల్లె రమేష్, కోఆప్షన్ సభ్యులు అమీద్ ఖాన్ బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News