Saturday, March 21, 2026

నిత్య అన్నదాన సత్రం శాశ్వత డైరెక్టర్ గా బల్ల విశ్వేశ్వరయ్య.!

  • నియామక పత్రం అందచేసిన అధ్యక్షులు మహంకాళి శ్రీనివాస్

నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ ( కోక్కుల వంశీ ): వేములవాడ అఖిలభారత శ్రీ రాజరాజేశ్వరి, రేణుక ఎల్లమ్మ గౌడ నిత్యాన్నదాన సత్ర, భవన ట్రస్ట్ శాశ్వత డైరెక్టర్ గా బల్ల విశ్వేశ్వరయ్య గౌడ్ ను నియమించినట్లు శ్రీ రాజరాజేశ్వరి, రేణుక ఎల్లమ్మ గౌడ నిత్య అన్నదానం సత్రం అధ్యక్షులు మహంకాళి శ్రీనివాస్ గౌడ్ నియామక పత్రాన్ని సోమవారం సత్ర భవనంలో అందజేశారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరయ్య మాట్లాడుతూ.. అఖిల భారత శ్రీ రాజరాజేశ్వరి రేణుక ఎల్లమ్మ గౌడ్ నిత్య అన్నదాన సత్రం, భవన ట్రస్టు అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని ఆయన తెలిపారు. ఆయన నియామకానికి సహకరించిన శ్రీ రాజరాజేశ్వరి రేణుక ఎల్లమ్మ గౌడ నిత్య అన్నదాన సత్ర భవనం గౌరవ అధ్యక్షులకు తల్వార్ సుమన్ కు, సత్రం అధ్యక్షులు మహంకాళి శ్రీనివాస్ గౌడ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సత్రం అధ్యక్షులు మాట్లాడుతూ అఖిలభారత శ్రీ రాజరాజేశ్వరి, రేణుక ఎల్లమ్మ గౌడ నిత్య అన్నదాన సత్ర భవనంలో సుమారుగా1, 620 సభ్యత్వాలు నమోదు చేయడం జరిగిందని అన్నారు. అలాగే దాతలు ముందుకు వచ్చి సహకారం అందించాలని ఆయన విన్నవించారు. దక్షిణ కాశిగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధిలో అన్నదాన సత్ర భవనం నెలకొల్పడం, దాతలు సహకారంతో నిత్యం అన్నదానం కార్యక్రమం, అలాగే రాజన్న దర్శనానికి వచ్చే భక్తుల కోసం సత్రంలో వసతి గదుల సౌకర్యం కల్పిస్తున్నట్లుగా   ఆయన తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News