నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి ( కోక్కుల వంశీ ): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామంలోని శ్రీ భవాని శంభులింగేశ్వర స్వామి మహాశివరాత్రి జాతర రానున్న నేపథ్యంలో (మానాల) చింతామణి తండా గ్రామానికి చెందిన ప్రముఖ వైద్యుడు గుగులోత్ ప్రకాష్ నాయక్ హైదరాబాద్ లో వైద్యరంగంలో స్థిరపడి పుట్టిన ఊరుపై మమకారంతో రానున్న శ్రీ భవానీ శంభులింగేశ్వర స్వామివారి కళ్యాణం మరియు జాతరలో పాల్గొననున్న స్వామి వారి భక్తులకు మహా అన్నదాన కార్యక్రమానికి 15 క్వింటాళ్ల బియ్యాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా శ్రీ భవాని శంభులింగేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు గుగులోత్ ప్రకాష్ ను శాలువాతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందించి, కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కొండ రాజేందర్, వైస్ చైర్మన్ పిసరీ భూమయ్య, తుమ్ జలపతి, జక్కు మోహన్ గ్రామస్థులు పాల్గొన్నారు.





