- జగిత్యాల డిఎస్పి శ్రీ రఘు చందర్
నేటిసాక్షి, (కె. గంగాధర్) పెగడపల్లి : పెగడపల్లి మండల కేంద్ర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాలకు చెందిన చంద్రమౌళి మరియు బతికేపల్లి గ్రామానికి చెందిన మల్లేశం, చింతకిందు కిషోర్ అను వ్యక్తులు ముగ్గురు కలిసి NAPS అనే సంస్థ ద్వారా రైతులకు 40% పర్సెంట్ సబ్సిడీ క్రింద ట్రాక్టర్లు ఇప్పిస్తామని బత్కేపల్లి మరియు నందగిరి గ్రామంలోని ఆరుగురు అమాయకపు రైతులను నమ్మించి వారి వద్ద నుంచి దాదాపు 36 లక్షల రూపాయలను వసూలు చేసి అందులో నుండి దాదాపు 10 లక్షల వరకు డౌన్ పేమెంట్ గంగాధర మండలం లోని శ్రీ వేంకట సాయి ఎంటర్ప్రైజెస్ జాన్ డియర్ ట్రాక్టర్ షోరూం యాజమాన్యం యొక్క ప్రోద్బలంతో వారికి ట్రాక్టర్లు ఇప్పించి అట్టి అమాయకపు రైతులకు తెలియకుండా సబ్సిడీ కోసమని వారి సంతకాలు తీసుకొని EMI కట్టుకునే విధంగా పై ముగ్గురు కలిసి ప్రాసెస్ చేసి మిగిలిన సుమారు 26 లక్షల రూపాయలను తలో కొంత మొత్తంలో తమ సొంత అవసరాలకు వాడుకొని రైతులను మోసం చేసిన మన్నె మల్లేశం, చింతకింది కిషోర్ మరియు కామెర చంద్రమౌళి, అను వ్యక్తులను పెగడపల్లి పోలీసులు సీఐ మల్యాల నీలం రవి ఎస్సై రవికిరణ్ లు ఈరోజు పట్టుకొని జగిత్యాల కోర్టు లో ప్రవేశపెట్టి ఆ ముగ్గురు నిందితులను రిమాండ్ కు తరలించారని తెలిపారు. ఇదే కామెర చంద్రమౌళి కి చెందిన NAPS అనే ప్రైవేట్ సంస్థపై మంచిర్యాల లో చాలామంది రైతులను ఇదేవిధంగా మోసం చేసినందుకు గత సంవత్సరం నవంబర్ నెలలో కూడా మంచిర్యాల పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనట్లు తెలిసిందని అదేవిధంగా పెగడపల్లి మండల ప్రాంతంలో కూడా పైన తెలిపిన విధంగా EMI క్రింద ఆరుగురు అమాయకపు రైతులకు ట్రాక్టర్లు ఇప్పించినట్లు మరియు వారిని మోసగించుటలో సహకరించిన శ్రీ వేంకట సాయి ఎంటర్ప్రైజెస్ జాన్ డియర్ ట్రాక్టర్ షోరూం యాజమాన్యం వారి పై కూడా దర్యాప్తు జరుపుతున్నట్టు జగిత్యాల డిఎస్పి శ్ రఘు చందర్ వివరాలను వెల్లడించినారు. వారితో పాటు సీఐ నీలం రవి ఎస్ ఐ రవికిరణ్ ఇతర పోలీస్ సిబ్బంది వున్నారు.





