నేటి సాక్షి, కొడిమ్యాల:
కొడిమ్యాల మండలం పూ డూరు గ్రామంలోకి మంగళవారం ఉదయం గౌరాపూరు దొంగలమర్రి గుట్టల మధ్య నుండి అడవిలో తాగడానికి నీరు లేక నీటి కోసం దాదాపు నాలుగు సంవత్సరాల వయసు గల చుక్కల ( మగ ) దుప్పి గ్రామంలోకి వచ్చింది. దానిని చూసిన ఊర కుక్కలు దాని వెంట పడడంతో దుప్పి భయంతో పరిగెత్తే సమయంలో దాని వెనుక కాలు విరిగిపోవడంతో పూడూరులోని బస్టాండు చౌరస్తాలో హోటల్ వెనక మెట్ల కింద తల దాచుకుంది. విషయం గ్రామస్తులు మండల F R O అటవీశాఖ అధికారి మొహినోదిన్ కు సమాచారం ఇవ్వగా అటవీశాఖ సిబ్బంది చేరుకొని ఆటోలో కొడిమ్యాల ప్రాథమిక పశు వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స చేయించి, కరీంనగర్ జూపార్క్ కి పంపించామని అటవీ శాఖ అధికారి మోహినోదిని తెలిపారు





