
నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం, (చిక్కిరి శ్రీకాంత్): ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ బడంగ్పేట్ మున్సిపాలిటీ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహా రెడ్డి మహేశ్వరం మండల అధ్యక్షులు.రాజు గొల్లూరి పాల్గొన్నారు. సోనియమ్మ కుటీరంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి యువజన కాంగ్రెస్ శిక్షణ శిభిరం నేడు ముగియనున్న సందర్భంగా
ముఖ్య అతిథులుగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి యువజన కాంగ్రెస్ నాయకులకు దిషా నిర్దేశం చేసిన ఏఐసీసీ కార్యదర్శి మహబూబ్ నగర్ పార్లమెంట్ ఇంచార్జ్ శ్రీ చల్లా వంశీ చందర్ రెడ్డి, టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్, ఏఐసిసి మెంబర్ డాక్టర్ కోట నీలీమ మరియు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, ఫిషర్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మెట్టు సాయి ముదిరాజ్ గారు మరియు బడంగ్ పేట మున్సిపాలిటీ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నాయకులకు ఘన స్వాగతం పలికిన యువజన కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి మాట్లాడుతూ.. గత రెండు రోజులుగా శిక్షణ శిభిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ యువజన కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కోసం సైనికుల్లా పనిచేయాలని అన్నారు, గత రెండు రోజులుగా శిక్షణ శిభిరంలో నేర్చుకున్న ప్రతి అంశాన్ని క్రింద స్థాయి యువజన కాంగ్రెస్ నాయకులకు వివరించాలని తెలిపారు. అదే విధంగా రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం యువజన కాంగ్రెస్ కీలక పాత్ర పోషించాలని, యువజన కాంగ్రెస్ నాయకులంతా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సారిద్యంలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని ప్రజలకు వివరిస్తూ అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలిపారు. ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, తమ తమ జిల్లాల్లో నియోజకవర్గాల్లో క్రమ శిక్షణతో మెదులుకోవాలని సూచించారు.





