Saturday, March 21, 2026

రోడ్డు నిర్మాణం కోసం ఆర్టీసీ బస్సు ను 20 రోజులు పాటు నెత్తకుప్పం వరకు తిప్పేందుకు అనుమతి ఇవ్వండి

  • ఆర్ టి సి అధికారులకు ప్రజలు వేడుకోలు

నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) : రామచంద్రాపురం మండలంలోని నెత్తకుప్పం ప్రధాన రహదారి ఆర్ అండ్ బి రోడ్ గుంతలమయమై ప్రజలు ప్రయాణం చేయాలంటే నరకయాతన పడుతున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చొరవతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి కల్వర్టు వరకు రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు విడుదలైందని ప్రజలు ప్రయాణం సౌకర్యార్థం రోడ్డు నిర్మాణం పనుల కోసం 20 రోజులు పాటు తిరుపతి నుంచి నెత్తకుప్పం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరకు తిప్పేందుకు అనుమతి ఇవ్వాలని నెత్తకుప్పం చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలు ఆర్ టి సి అధికారులకు వినతి పత్రం సమర్పించారు ప్రత్యామ్నాయ రోడ్ ఏర్పాటు చేసుకోవాలన్నా రోడ్ ప్రక్కన ఉన్న రైతులు ప్రత్యామ్నాయ రోడ్ ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారని వినతి పత్రం లో విన్నవించారు. చిత్తూరు-పెనుమూరు బస్సు వయా అనుప్పల్లి చంద్రగిరి మీదుగా తిరుపతి కి చేరుకునేందుకు విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ప్రయాణం సులభతరం అవుతుందని తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News