నేటి సాక్షి, సైదాపూర్: సైదాపూర్ మండల కేంద్రంలో అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్,మెదక్, ఉమ్మడి జిల్లాలో నిరుద్యోగ సమస్యలను పరిష్కరించే వ్యక్తిగా, మీ ప్రతినిధిగా నరేందర్ రెడ్డిని ఆశీర్వదించమని పొన్నం ప్రభాకర్, రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు అదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్ ఆధ్వర్యంలో వెన్కేపల్లి-సైదాపూర్ పట్టభద్రుల ఇంటి వద్దకు వెళ్లి ప్రచారం చెయ్యడం జరిగింది. మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి అని ఓటర్లనుకోరడం జరిగింది. పోలింగ్ తేది: 27 02 2025 గురువారం అందరు తప్పకుండా ఓటు వినియోగించుకోవాలని తెలపడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాదెండ్ల రాజ్ కుమార్, సైదాపూర్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు వేముల సాయికుమార్, హుస్నాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బొనగిరి అనిల్ గారు, బండారి శరత్ కుమార్, మెదరి శ్రీ రఘన్, సాయి కిరణ్, సత్య నాగులు, విజయ్ ప్రకాష్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.





