నేటి సాక్షి, బెజ్జంకి: మండలంలోని గుండారం గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు గ్రామ మాజీ ఉప సర్పంచ్ ఎలుకంటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం ప్రింటర్‌ను బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాల కార్యాలయ పనులు మరియు పరీక్ష పత్రాల ముద్రణ సులభతరం చేసేందుకు ఈ ప్రింటర్ అందజేసినట్లు తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తిరుపతి మరియు ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డి ప్రింటర్ దాతకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు దేవయ్య, సంపత్, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.





