
నేటి సాక్షి, మెట్ పల్లి : మల్లాపూర్ మండలంలోని సాతారాం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.మంగళవారం సి ఐ మాట్లాడుతూ ఒక ట్రాక్టర్ పట్టణ శివారులోని రైల్వే బ్రిడ్జి వద్ద, మరొకటి వెంపేటలో పట్టుకున్నట్లు ఆయన తెలిపారు.తదుపరి చర్యల నిమిత్తం ఇసుకను తహసీల్దార్ కార్యాలయంకు ట్రాక్టర్ యజమానులపై చర్యల నిమిత్తం కోర్ట్ కు పంపినట్లు సిఐ తెలిపారు. మెట్ పల్లి సర్కిల్ పరిధిలో అక్రమంగా ఇసుక రవాణా చేయడం ట్రాక్టర్, లారీల యజమానులు మానుకోవాలి లేకుంటే కఠిన చర్యలు ఎదుర్కోవలసి ఉంటుంది సీఐ నిరంజన్ రెడ్డి హెచ్చరించారు.





