Saturday, March 21, 2026

బెజ్జంకి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

నేటి సాక్షి, బెజ్జంకి: మండల కేంద్రం బెజ్జంకి లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు, విష్ణు సహస్ర నామాలు, పూలతో స్వామి వారి ప్రత్యేక అలంకరణ, అభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు హాజరై తమ తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఇకనుండి ఆలయంలో ప్రతినెల స్వాతి నక్షత్రం రోజున పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఆలయ కమిటీ చైర్మన్ జెల్ల ప్రభాకర్ యాదవ్, ఆలయ ప్రధాన పూజారి శేషం మధుసూదనా చారి, కమిటీ సభ్యులు దోనే శ్యామ్, గుబిరే చంద్రం, బర్ల రాజయ్య, పొట్లపల్లి ప్రభాకర్, పలువురు భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News