నేటి సాక్షి, మెట్ పల్లి : పట్టణంలో మంగళవారం గీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్ష,ఉపాధ్యక్ష ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి.ఎన్నికల అధికారి,అసిస్టెంట్ రిజిస్టర్ సిహెచ్ మల్లేశం ఆధ్వర్యంలో గీత పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు జరుగగా నూతన అధ్యక్షులుగా పూదరి సుధాకర్ గౌడ్, ఉపాధ్యక్షులుగా చర్లపల్లి రాజేశ్వర్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నిక జరిగినట్టు అయన తెలిపారు. అలాగే డైరెక్టర్లుగా చెర్లపల్లి సత్యమ్మ, అంగ లక్ష్మీబాయి, ఎనుగందుల శ్రీనివాస్ గౌడ్,గుండావేని ప్రణయ్ గౌడ్, పొన్నం శ్రీనివాస్ గౌడ్, గొట్టిపర్తి రాజేందర్ గౌడ్, బక్కూరి రమేష్ గార్లు గెలుపొందారు .వీరికి ఎన్నికల అధికారి సిహెచ్ మల్లేశం నియామక పత్రాలు అందజేశారు. నూతనంగా అధ్యక్షులుగా ఉపాధ్యక్షులకు ఎన్నికైన వారిని సంఘ సభ్యులు ఘనంగా సన్మానం చేశారు. తమకు ఏకగ్రీవంగా ఎన్నిక సహకరించిన డైరెక్టర్లకు గీత కార్మిక సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పుల్ల చిన్నయ్య గౌడ్, పూదరి శ్యామ్ గౌడ్, చర్ల పెళ్లి హన్మాండ్లు గౌడ్, సుద్దాల వెంకటనారాయణ గౌడ్, ముంజే సత్యనారాయణ గౌడ్, గొట్టిపడత చంద్రయ్య గౌడ్, కోటగిరి అనిల్ గౌడ్, చర్లపల్లి అరుణ్ దీప్ గౌడ్, అంగ రవి గౌడ్, మాదాసు శ్రీను గౌడ్, పుల్ల శేఖర్, చిన్న అంజయ్య, గంగారం, వెంకటేశ్వర్లు, వందల శ్రీనివాస్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.





