నేటి సాక్షి గోదావరిఖని (రమేష్) : ప్రపంచ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని కళాశాలలో విస్తృత ఉపన్యాసం ఏర్పాటు. కార్యక్రమంలో మాట్లాడటానికి జంగారెడ్డి గూడెం.చత్రపతి శివాజీ త్రి శత జయంతి (CSTS) ప్రభుత్వ కళాశాల తెలుగు ఉపన్యాసకులుగా పని చేస్తున్న డా జి. వెంకట లాల్. ముఖ్య అతిథిగా విచ్చేసి తెలుగులో ఉపాధి & ఉద్యోగ అవకాశాలు అనే అంశంపై ప్రసంగించారు. మాట్లాడుతూ… తెలుగు భాష ద్వారా అనేక రంగాల్లో ఉపాధి అవకాశాలు మెండు ఉన్నాయని, అవి ప్రధానంగా ప్రభుత్వ, ప్రైవేటు, సాంకేతిక, సాంస్కృతిక, రాజకీయ రంగంలో విద్యారంగం అనువాద రంగంలో, సినీ రంగంలో తెలుగు భాశావేత్తలకు, ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయని ఉదాహరణలతో సహా ప్రబోధించారు. విద్యార్థులకు ఎంతో ఉపయుక్తమైన ఉపాధి ఉద్యోగ అవకాశాలు పై కార్యక్రమం ఏర్పాటు. చేసినందుకు కళాశాల తెలుగు లెక్చరర్లు శ్రీమతి ఎస్. సమత, శ్రీమతి కె. అరుణ ను కళాశాల ప్రధాన చార్యులు ప్రిన్సిపల్ అభినందించారు. దూరం నుండి మా కళాశాల విద్యార్థులకు మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి వివరించడానికి విచ్చేసిన డా జి. వెంకట లాల్. ప్రత్యేకమైన కృతఙ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా తెలుగు భాష ద్వారా ఇన్ని అవకాశాలు ఉన్నాయన్న విషయం ఇంతవరకు మాకు ఎవరు చెప్పలేదని విద్యార్థులు స్పందించి ముఖ్యఅతిథికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ శ్రీ ఏ సాంబశివరావు, సీనియర్ అధ్యాపకులు డా జి సుబ్బారావు, డా పి. శంకరయ్య, డా. బి తిరుపతి, డా. జి శారద, డా. డి కిరణ్మయి, పి. శ్రీదేవి, డా. సురేష్, డా. నరేష్, డా. అజయ్ కుమార్, డా. డా. స్రవంతి, డా. నరేష్, పి. ఉషారాణి పాల్గొన్నారు.





