Saturday, March 21, 2026

ఇటిక్యాల పాఠశాలల్లో జిల్లా మానిటరింగ్ కమిటీసభ్యులు

నేటిసాక్షి, రాయికల్ ( సింగిడి కార్తీక్) :
రాయికల్ మండలంలోని ఇటిక్యాల ఉన్నత పాఠశాల, మాడల్ స్కూల్ పాఠశాలలో ఎఫ్.ఎ మార్కులను జిల్లా మానిటరింగ్ టీం సభ్యులు బోగ రమేష్, సీమలదారి సదాశివ్ లు మంగవారం పరిశీలించారు. పదవ తరగతి ఎఫ్.ఎ మార్కులను, రికార్డులను పరిశీలించి విద్యార్థుల ప్రగతిని తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని , ప్రభుత్వ విద్యను, ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించే బాధ్యత అందరు తీసుకోవాలన్నారు . వార్షిక పరీక్షల్లో శతశాతం ఫలితాలు సాధించాలని ఆదిశగా విద్యార్థులు కష్టపడి చదివి దైర్యం తో భయం లేకుండా పరీక్షలు వ్రాయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మానిటర్ టీం సభ్యులు చెరుకు మహేశ్వర శర్మ, బొమ్మకంటి రవి కుమార్, వేముగంటి గిరిధర్, మండలోజు రవీందర్, ఆర్.యు.పి.పి.రాష్ట్ర శాఖ సహాధ్యక్షులు వేల్పుల స్వామి యాదవ్, గాజంగి రాజేశం తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News