Saturday, March 21, 2026

పట్టభద్రుల, టీచర్ల ఎమ్మెల్సీ ఓట్లలో బీజేపీ అభ్యర్ధులని గెలిపించాలని ప్రచారం

నేటి సాక్షి, బెజ్జంకి: పట్టభద్రుల,టీచర్ల ఎమ్మెల్సీ ఓట్లలో బీజేపీ అభ్యర్ధులని గెలిపించాలని బీజేపీ మండల అధ్యక్షులు కొలిపాక రాజు ఆధ్వర్యంలో కరీంనగర్, మెదక్, నిజామాబాద్, అదిలాబాద్ పట్టభద్రుల, టీచర్ల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా చిన్నమయిల్ అంజిరెడ్డి, మల్కా కొమురయ్యలను గెలిపించాలని పట్టభద్రుల, టీచర్లను కోరారు.మండలంలోని వీరపూర్, బేగంపేట, బెజ్జంకి మండల కేంద్రంలో ఓటర్ల ను కలిసి ఓటు అభ్యర్థిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మానకొండూరు నియోజకవర్గం టీచర్ ఎమ్మెల్సీ ప్రబారి గుర్రాల వెంకట్ రెడ్డి,పట్టభద్రుల ఎమ్మెల్సీ మానకొండూరు నియోజకవర్గం ప్రబారి ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ప్రతి నెల నిరుద్యోగ భృతి క్రింద 4000/-వేలు ఇస్తానని నిరుద్యోగుల ఓట్లు దండుకొని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని తెలియజేసారు. పట్టభద్రుల-టీచర్ల సమస్యలపై అనునిత్యం కొట్లాడే బిజెపి పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులైన అంజిరెడ్డి-కొమురయ్య లకు మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మండల ఇంచార్జిలు సాన వేణు, దారం సత్తిరెడ్డి,మండల సీనియర్ నాయకులు బుర్ర మల్లేశం గౌడ్, మండల నాయకులు రాచకొండ శ్రీదర్ రావు, సుదీర్ రావు గంప లవన్, కొర్వి అమర్, ఒగ్గు కనుకయ్య, బుర్ర కిషన్, బుర్ర వినిత్, పండుగ రోజు, రేవోజు నవీన్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News