
నేటి సాక్షి రామడుగు, (పురాణం సంపత్) : తమ పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలంటూ బిజెపి,కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రాడ్యుయేట్స్ వద్దకు వెళ్లి పోటాపోటీ ప్రచారం నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా రామడుగు మండలంలోని చిప్పకుర్తి, రామచంద్రపూర్ గ్రామాలలో యువజన కాంగ్రెస్ రామడుగు శాఖ అధ్యక్షులు అనపురం పరశురాం గౌడ్ ఆధ్వర్యంలో తమ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కి మద్దతుగా ఆయా గ్రామాలలో ప్రచార నిర్వహించారు. అలాగే బిజెపి మండల శాఖ మోడీ రవీందర్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో తమ పార్టీ అభ్యర్థి అయిన అంజిరెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.





