- విజేతలుగా నిలిచిన గర్రెపల్లి యువకులు
నేటి సాక్షి, రామడుగు( పురాణం సంపత్) : రామడుగు మండలంలోని గోపాల్ రావు పేట గ్రామంలో నవయుగ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో గత కొద్ది రోజులుగా ఉమ్మడి జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపెల్లి జిల్లా గర్రెపల్లి గ్రామానికి చెందిన సంతోష్ అజయ్ అత్యుత్తమ ప్రతిభను కనబరిచి విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా బహుమతులను సదిశ ఫౌండేషన్ విజేతలకు బహుమతులను స్పాన్సర్ చేశారు.ఈ కార్యక్రమంలో సదిశ ఫౌండేషన్ చైర్మన్ గజ్జల ప్రవీణ్, కోశాధికారి నవీన్ రెడ్డి, నవయుగ యూత్ క్లబ్ ప్రెసిడెంట్ ఎడవల్లి ఆనందం రెడ్డి, లయన్స్ క్లబ్ గవర్నర్ మొరబద్రేశం, క్లబ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.





