- సేంద్రియ ఎరువుల పై రైతులకు అవగాహన

నేటిసాక్షిన్యూస్ ఆళ్లగడ్డ ప్రతినిధి: అన్నదాతలకు అండగా సేంద్రియ ఎరువులతొ పండించిన పంటలు అధిక దిగుబడులు ఇస్తాయని షణ్ముఖ ఆగ్రోటెక్ ఏ ఏస్ ఏమ్. సిహెచ్. శ్రీనివాసరావు, మార్కెటింగ్ డెవలప్మెంట్ ప్రతినిధి బోడ. నవీన్ కుమార్, రవీందర్ రెడ్డి. ఫీల్డ్ అసిస్టెంట్ బొక్క ,శ్రీను, రాజు ,రామకృష్ణ లు అన్నారు. ఈ సందర్భంగా ఆళ్లగడ్డలో వారు మాట్లాడుతూ గత నెలబుధవారం వెస్ట్ గోదావరి జిల్లా, పెనుగొండ మండలం, చిన్న మల్లం గ్రామంలోషణ్ముఖ ఆగ్రోటెక్ సంస్థ ఆధ్వర్యంలో రైతు సోదరులకు సేంద్రియ ఎరువులపై అవగాహన సదస్సు నిర్వహించామన్నారుఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూషణ్ముఖ అగ్రిటెక్ సంస్థరైతుసోదరులకుగత 14 సంవత్సరాలుగానాణ్యమైన ఉత్పత్తులను అందిస్తూ అధిక దిగుబడులు సాదించేలా కృషి చేస్తున్నారని తెలిపారు. పంట సాగులో రసాయనిక ఎరువులు ఆధికంగా వాడడం వల్ల ఆహార ఉత్పత్తులు విషతుల్యం ఆవుతున్నాయి. రసాయన ఎరువులు వాడకం వల్ల క్రమక్రమంగా భూమిలో భూసారం తగ్గిపోయి, పంట దిగుబడులు తగ్గిపోతాయి. సేంద్రీయ ఎరువులువాడడం వల్ల పెట్టుబడులను తగ్గించుకోవచ్చు అన్నారు. మొక్కలకు కావాలసిన పోషకాలను అందించి మొక్కలలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని రైతులకు తెలిపారు.మా యొక్కఉత్పత్తులైన వామ్ గోల్డ్, కింగ్ జైమ్, వసుధ గ్రాను లెస్,టెర్మినేటర్ 11, తేజస్ ప్లస్,తేజల్ ,మోక్ష ,గార్డియను, సూష్మ పోషకాలైన భాగ్య ,భాగ్యమ్యాక్స్, సేంద్రీయ ఎరువులైన కీ అంతగాకుండా జీవ సస్యరక్షకాలైన అలాగే ఏకలవ్య వాడి అధిక దిగుబడులు సాధించవచ్చునని రైతులకు తెలియచేసారు. రైతన్నలు రసాయనిక ఎరువులు వాడటం పూర్తిగా తగ్గించి సేంద్రియ ఎరువుల వినియోగం పెంచాలన్నారు. రసాయనిక ఎరువులు వాడటం వల్ల భూమిలో సారం తగ్గడంతో పాటు రైతులు ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వస్తుందన్నారు. ఈ విషయం భూసార పరీక్షల్లో వెళ్లడైందన్నారు కావున సేంద్రియ ఎరువులు వాడటం వల్ల రైతులకు తక్కువ పెట్టుబడి తో భూమిసారవంతంగాతయారవ్వడమే కాక పంట దిగుబడి అధికంగా వచ్చి రైతులు అధిక లాభాలు పొందుతారన్నారు. రైతులకు వరి, కురగాయల పంటల పై వచ్చే చీడపీడల గురించివివరించడం జరిగిందన్నారు. కంపెనీ ఉత్పత్తులను గురించిరైతులకు అవగాహన కల్పించారు. పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మరియు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.





