- పార్టీకి చేసిన సేవలకు దక్కిన పదవి
- నరసయ్యను అభినందించిన గొండ్రియల గ్రామస్తులు
నేటి సాక్షి, కోదాడ ప్రతినిధి: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని గొండ్రియల గ్రామానికి చెందిన యడ్లపల్లి వెంకట్ నర్సయ్య ఎన్నికయ్యారు ఈమేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు వెంకట నరసయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు బిజెపి రాష్ట్ర కమిటీ తెలిపింది. ఈ సందర్భంగా వెంకట నరసయ్య మాట్లాడుతూ… పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషిచేయనున్నట్లు తెలిపారు. పార్టీ బలోపేతానికి అన్ని వర్గాల ప్రజలు, పార్టీ శ్రేణులు కలిసి వచ్చే విధంగా చూస్తానని తెలిపారు. నా ఎన్నికకు సహకరించిన… జిల్లా అధ్యక్షులు శ్రీలత రెడ్డి, నాయకులు బొబ్బ భాగ్యరెడ్డి ,కనగాల వెంకట్రామయ్య, నూనె సులోచన, అక్కిరాజు యశ్వంత్ ,కనగాల నారాయణ, బొలిశెట్టి కృష్ణయ్య, అంజి యాదవ్, చింతకుంట్ల సతీష్, ఏలేటి వెంకటేశ్వర్ రెడ్డి, సిద్దయ్య, లింగయ్య , యడ్లపల్లి రామారావు, జల్లా నరసింహారావు కి అభినందన తెలిపారు.





