నేటి సాక్షి, మెట్ పల్లి : మెట్ పల్లి పట్టణ గీతా కార్మిక సహకార సంఘ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నూతన కార్యవర్గానికి బుధవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం నిర్వహించారు. అధ్యక్షులుగా వరుసగా రెండోసారి ఎన్నికైన పూదరి సుధాకర్ గౌడ్, ఉపాధ్యక్షులుగా ఎన్నికైన చర్లపల్లి రాజేశ్వర్ గౌడ్ లతో పాటు డైరెక్టర్లు ఏనుగందుల శ్రీనివాస్ గౌడ్, పొన్నం శ్రీనివాస్ గౌడ్, గుండవేని ప్రణయ్ గౌడ్, గొట్టిపడ్త రాజేందర్ గౌడ్, బక్కూరి రమేష్ లను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గొల్లపల్లి రామా గౌడ్, జిల్లా అధ్యక్షులు చెట్ల చంద్రశేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి నాయిని శ్రీనివాస్ గౌడ్, కోరుట్ల నియోజకవర్గ అధ్యక్షులు ఏపూరి శ్రీనివాస్ గౌడ్ నాయకులు చర్లపల్లి చిన్న అంజగౌడ్,ముంజ సత్యనారాయణ గౌడ్, జోగున్పల్లి రాజేశ్వర్ గౌడ్, చెట్లపల్లి అశ్విన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.





