Monday, March 23, 2026

అభివృద్ధి పనుల పై ప్రత్యేక అధికారి ప్రఫుల్ దేశాయ్ సమీక్ష

నేటి సాక్షి, హుజూరాబాద్, ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
జిల్లా అదనపు కలెక్టర్ (L.B.), కరీంనగర్ మరియు హుజురాబాద్ పురపాలక సంఘ ప్రత్యేక అధికారి ప్రఫుల్ దేశాయ్, I.A.S. గారు తేదీ: 19-02-2025 రోజున హుజూరాబాద్ పురపాలక సంఘము పరిధిలో జరుగుచున్న వివిధ అభివృద్ధి పనుల పై పురపాలక సంఘ అధికారులతో ప్రత్యేకంగా సమీక్షా సమావేశము నిర్వహించినారు. తదుపరి ఆస్తి, నల్లా పన్నులు మరియు ట్రేడ్ లైసెన్స్, షాపుల కిరాయ వసూళ్లను మోఖా పై పరిశీలించి, పురపాలక సంఘమునకు బకాయ ఉన్న పన్నులను 31 మార్చి-2025 లోపు త్వరితగతిన వసూలు చేయుటకు ఆదేశములు జారీ చేసినారు. అదేవిధంగా, పట్టణములోని జమ్మికుంట రోడ్డు వెంట ఉన్న పంట కాలువ మరియు మురికి కాలువలను పరిశీలించడం జరిగినది. ఇట్టి కార్యక్రమము నందు కమిషనర్ కె. సమ్మయ్య గారు, మేనేజర్ ఆర్. భూపాల్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ ఎన్. అశ్వినీ గాంధీ, సీనియర్ సహాయకులు MD. రషీద్, జె. శ్రీకాంత్, వార్డు అధికారులు, సానిటరీ జవాన్లు ఆర్. సుధీర్ మరియు తూముల కుమార్ పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News