- జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి


నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : బుధవారం పెబ్బేరు మండల పరిధిలోని వై శాఖాపురం గ్రామ సమీపంలో ఉన్న ఇసుక రీచును, రాంపురం గ్రామ శివారులో అధికారులు సీజ్ చేసిన ఇసుక నిల్వలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఇసుకరీచులపై సంబంధిత మండలాల తహసీల్దార్లు నిరంతర పర్యవేక్షణ ఉంచాలని ఆదేశించారు. జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఇసుక నిల్వలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలింపు చేసే వారిపై నిఘా ఉంచి, సదరు వ్యక్తులపై వాహనాలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. రాంపురం లో ఇటీవల అధి కారులు సీజ్ చేసిన ఇసుక నిల్వలను జాగ్రత్తగా పర్యవేక్షణలో ఉంచాలని అక్కడే విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి సూచించారు. సీసీ కెమెరాలు పర్యవేక్షణలో నిఘా ఉంచాలని చెప్పారు. పెబ్బేరు తహసిల్దార్ లక్ష్మి, ఇతర రెవెన్యూ అధికారులు, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.





