- ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
నేటి సాక్షి, ప్రతినిధి వనపర్తి జిల్లా : మనిషి జీవితంలో సొంత ఇంటి కల నెరవేర్చుకోవడం గొప్ప అదృష్టమని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. బుధవారం గోపాల్పేట మండలం ఏదుల గ్రామానికి చెందిన సుఖేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డిల నూతన గృహప్రవేశ కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. ముందుగా నరేందర్ రెడ్డి గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే సత్యనారాయణ స్వామి తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం సుఖేందర్ రెడ్డి గృహప్రవేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే మాట్లాడారు.కార్యక్రమంలో గోపాల్పేట, రేవల్లి, ఏదుల మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





