Saturday, March 21, 2026

ఎమ్మెల్సి నరేందర్ రెడ్డిని గెలిపించండి

నేటి సాక్షి, మెట్ పల్లి : కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సి అభ్యర్థి పుట్కూరి నరేందర్ రెడ్డి ని గెలిపించాలని రాష్ట్ర గ్రంధాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్ అన్నారు. బుధవారం మెట్ పల్లి లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు తో కలిసి ఆయన మాట్లాడారు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పుట్కూరి నరేందర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని పట్టా భద్రుల సమస్యలు పరిష్కారానికి ఆయన పట్టుదలతో కృషి చేస్తారని అన్నారు.వారికి పట్టభద్రుల సమస్యలు అవగాహన ఉన్నదని. తప్పకుండా మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి పట్టభద్రుల తరఫున గెలిపించాలని కోరారు. రాష్టంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో రాష్ట్రం అత్యధిక అభివృద్ధి చెందుతుందని పేదలకు అభివృద్ధి ఫలాలు అద్దుతున్నాయని పేర్కొన్నారు.కేసీఆర్ ఆరిపోయే దీపమని పార్టీ మనుగడ లేకుండా పోయిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని పట్ట భద్రులకు ఏ సహాయం కావాలన్నా మీకు అండగా ఉంటామని అన్ని విధాల మీ సమస్యలకు ముందుండి పరిష్కరిస్తామని తప్పకుండా కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్సీగా గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జెట్టి లింగం, మండల అధ్యక్షులు తిప్పిరెడ్డి అంజిరెడ్డి, రాష్ట్ర నాయకులు ఆఏజ్, పట్టణ యూత్ అధ్యక్షులు లక్ష్మణ్, నాగభూషణం, కొంతం రాజు, వెంకటి, నాయిని సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News