Saturday, March 21, 2026

ఘనంగా చత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు

ఆరె కుల సంక్షేమ సంఘ నాయకుల నిర్వహణ

నేటి సాక్షి, హుజూరాబాద్, ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
ఆరె కుల సంక్షేమ సంఘం హుజురాబాద్ అధ్యక్షులు మోకిలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ మహారాజ్ జెండా ఆవిష్కరించి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా మొకిలి శ్రీనివాస్ మాట్లాడుతూ… శివాజీ మహారాజ్ సమర్థుడు మాత్రమే కాదు, హిందూస్వరాజ్య స్థాపనకు జీవితాన్ని అంకితం చేసిన మహానేత అని కొనియాడారు. శివాజీ మహారాజ్ భారత దేశ చరిత్రలోనే గొప్ప మహనీయుడు, యోధుడు, మరాఠ సామ్రాజ్య స్థాపకుడు అని కొనియాడారు. శివాజీ మహారాజ్ 19 ఫిబ్రవరి 1630 రోజున మహారాష్ట్రలోని శివనేరి దుర్గం లో జన్మించినరని, ఆయన చిన్ననాటి నుండే రాజ్య కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొనేవారిని, ధైర్యం సాహసం అనే ఆయుధాల్ని ధరించి పోర్చుగీస్, డచ్, బ్రిటిష్, మొగల్, ఆదిల్షాహి రాజ్యాలను యుద్దాలలో ఓడించి భారతదేశంలో హిందూ సామ్రాజ్యాన్ని నెలకొల్పిన యోధుడని గుర్తు చేశారు. ఇట్టి కార్యక్రమంలో అధ్యక్షుడు మొకిలి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు అంగరిక శంకర్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి మొకిలి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి ఉపాస సురేందర్, కోశాధికారి ఉపాస రాజకుమార్, కార్యవర్గ సభ్యులు ఉపాస నరేష్, మొకిలి రాజన్న, కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News