Saturday, March 21, 2026

గంజాయి కేసులలో నిందితులపై ప్రత్యేక నజర్

  • ఈ ఏడాది 48 మందిని అరెస్ట్
  • 2.200 గ్రాముల గంజాయి, 12 గంజాయి మొక్కలు స్వాధీనం
  • ఎస్పీ అఖిల్ మహాజన్

నేటి సాక్షి ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల ( కోక్కుల వంశీ ) : జిల్లాలో గంజాయి అక్రమ రవాణా,గతంలో గంజాయి కేసులలో నిందితులుగా ఉన్నవారిపై నజర్ ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ అఖిల్ మహాజన్ బుధవారం ఓ ప్రకటన లో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహజన్ మాట్లాడుతూ… గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి జిల్లా పోలీస్ విన్నూత కార్యక్రమలు చేపడుతూ ప్రజల్లో అవగాహన కల్పింస్తుదని, జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై స్పెషల్ డ్రైవ్ లు,నార్కోటిక్ జగిలాలతో తనిఖీలు చేపడుతూ గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపడం జరుగుతుందన్నారు. గంజాయి అక్రమ రవాణాపై ,గతంలో గంజాయి కేసులలో నిందుతులుగా ఉన్నవారిపై నిఘా ఉంచి గంజాయి కిట్ల సహాయంతో యూరిన్ టెస్ట్ లు నిర్వహించి గంజాయి సేవించే వారిని వారికి గంజాయి అందించే వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నామన్నారు. గంజాయి కిట్ల సహాయంతో, నార్కోటిక్ జాగిలాలతో స్పెషల్ డ్రైవ్ లు ఏర్పాటు చేసి ఈ సంవత్సరం 22 కేసులలో 48 మందిని అరెస్ట్ చేసి 2.200 గ్రాముల గంజాయి, 12 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు. జిల్లాలో గంజాయి విక్రయించిన,సాగు చేసిన, రవాణా చేసిన సేవించిన వారి సమాచారం RS-NAB 8712656392 నంబర్ కి అందించలని,సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుదని, గంజాయి కి అలవాటు పడిన వారిని పోలీస్ డి ఆడిక్షన్ సెంటర్ లో కౌన్సెలింగ్ కోసం పై నంబర్ ని సంప్రదించవచ్చని తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News