- మండలంలో చత్రపతి శివాజీ జయంతి వేడుకలు
నేటి సాక్షి, వేమనపల్లి : వేమనపల్లి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో బుధవారం చత్రపతి శివాజి 395వ జయంతి వేడుకలు ఆరె సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి కుబిడే వెంకటేషం, జిల్లా ఉపాధ్యక్షులు కుబిడే మధుకర్, జిల్లా కార్యవర్గ సభ్యులు మానేపల్లి సత్యనారాయణ కుల సంఘం సభ్యులు పాల్గొన్నారు. సుంపుటం గ్రామంలో కుబిడే వెంకటేశం, దందేర మహేష్, కుబిడే కిష్టయ్య, నాణేష్, శేఖర్, ముసలయ్య, పుల్లయ్య, సంజీవ్, చప్పిడే తిరుపతి, అల్గం కిష్టయ్యలు పాల్గొన్నారు. ముల్కలపేట గ్రామంలో గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసారు.చిన్న పెద్ద యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం స్వీట్స్ పంచిపెట్టారు.ఈ కార్యక్రమంలో తుమ్మిడే లచ్చయ్య, ఒడిల రాజన్న, బోర్కుటి సంతోష్,కొంపురి రమేష్,గొండే రాజన్న,బొర్కుటి లచ్చన్న, పాలె కిరణ్, ఒడిల శ్రీనివాస్, ఒడిల సుధాకర్, గొండె పున్నం, కొంపురి రాజన్న, బెడ్డల రాజలింగు, కామేర గణేష్, ఎన్నం అరుణ్ లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ భారత జాతి వీరత్వానికి ప్రతీకగా శివాజీ నిలిచారని దేశం గర్వించే మహనీయుడు అని కొనియాడారు. కుల మతాలకు అతీతంగా ప్రజలకు నిస్వార్థ సేవలను అందించిన మహనీయుడు చత్రపతి అని శివాజీ మహారాజ్ పరిపాలన విధానాలు వ్యక్తిత్వం నేటితరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పలు గ్రామల యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





