- జాతీయ కమిటీ పిలుపులో భాగంగా రాయచోటిలో నిరసన కార్యక్రమం
- జిల్లా ప్రధాన కార్యదర్శి : తుమ్మల లవ కుమార్
నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా ప్రతినిధి భక్త కుమార్ : ఏఐఎస్ఏ జాతీయ కమిటీ పిలుపులో భాగంగా నేడు అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలో నేడు ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్మల లవ కుమార్ ఆధ్వర్యంలో జామియా యూనివర్సిటీలో సస్పెండ్ గురైన విద్యార్థుల సస్పెండ్ ను వెంటనే ఎత్తివేయాలని నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ ఢిల్లీ మరియు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాల్లో యూనివర్సిటీ ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని అదేవిధంగా ప్రభుత్వాలు విద్యార్థుల గొంతును నొక్కడంపై, విశ్వవిద్యాలయాల్లో అందరికీ సమానత్వం న్యాయం మరియు గౌరవనీ ఇవ్వాలని ముఖ్యంగా జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం నందు ఎవరినైతే సస్పెన్షన్ చేశారో ఆ 17 మంది విద్యార్థులపై సస్పెన్షన్ రద్దు చేయాలని వారు కోరారు. నూతన నాయకనాయకత్వాలకియూనివర్సిటీ లుపట్టుకొమ్మల్లాగా ఉంటాయి అన్నారు.నేడు యూనివర్సిటీలలో కాషాయీకరణ, మతోన్మాద, శక్తులు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులపై దాడులకు ఉసిగొల్పుతున్నారు. శాస్త్రీయంగా ఆలోచన విధానాలు లేకుండా (కులం, మతం, ప్రాంతం, వర్ణం,వర్గం) మూఢత్వంలో విద్యాలయాలను తయారు చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ప్రశ్నించే విద్యార్థి నాయకుల పై తప్పుడు కేసులు బనాయించి వేధించడం ఆపి,ఏదైతే యూనివర్సిటీలలో విద్యార్థిని నాయకులను సస్పెండ్ చేశారో ఆ విద్యార్థి నాయకుల యొక్క సస్పెండ్ వెంటనే రద్దు పరచాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ గా డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సతీష్, కిరణ్ కుమార్, రెడ్డిమహేష్,వెంకటరమణ అరవింద్ తదితరులు పాల్గొన్నారు.




