Monday, March 23, 2026

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన శ్రీరాములు అందెల

  • రక్తదాతలు ప్రాణదాతలుగా నిలుస్తారు – శ్రీరాములు అందెల

నేటిసాక్షి ప్రతినిధి, మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్-2 అల్మాస్ గూడ లోని వినాయక హిల్స్ కాలనీలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా బిజెపి జిల్లా కౌన్సిల్ సభ్యులు శివారెడ్డి ఆధ్వర్యంలో మిత్ర బ్లడ్ బ్యాంక్ సారిధ్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ హాజరై ముందుగా చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ హిందూ బంధువులందరికీ చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. శివాజీ మహారాజ్ జయంతి నాడు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన శివారెడ్డిని మరియు మిత్ర బ్లడ్ బ్యాంక్ అభినందించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తోటి వారిని కాపాడడంలో రక్త దాతలు ప్రాణదాతలుగా నిలుస్తారని అన్నారు. ప్రతి ఒక్కరూ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ 2 అధ్యక్షులు రామిడి వీరకర్ణ రెడ్డి, మాజీ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకట్ రెడ్డి, మహేష్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, విజయ్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, రమేష్ యాదవ్, మనోజ్, మహేష్ గౌడ్, రోహన్, మహేష్, అభిషేక్ మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News