- రజక సంఘం జిల్లా అధ్యక్షులు విజయ్

నేటి సాక్షి, ప్రతినిధి వనపర్తి జిల్లా : జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదయంలో వెనుకబడిన తరగతుల జిల్లా అధికారి బీరం సుబ్బ రెడ్డి గారికి బుధవారం కలవడం జరిగింది.జిల్లాలోని అన్ని మండలాల్లో దోబీ గాట్లను ఏర్పాటు చేయాలని రజక సంఘం జిల్లా అధ్యక్షులు విజయ్ వినతి పత్రం ద్వారా బిసి అధికారికి తెలపడం జరిగింది. అనంతరం రజక సంఘం జిల్లా అధ్యక్షులు విజయ్ మాట్లాడుతూ.. రజకులు బట్టలు ఉతుకునుటకు చెరువులలో కుంటలకు వెళ్తూ ఇబ్బందులకు గురవుతున్నారు. మారుతున్న కళనుగుణంగా కులావృత్తిలో అనేక మార్పులు వచ్చాయి. మా దోబీ బట్టలు ఉత్తుకునే పని ని అదునాతన మాడ్రన్ వాషింగ్ మిషన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి మండలానికి అధునాతన వాసం ప్లాంట్ లు ప్రభుత్వం చే ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం జిల్లా సలహాదారులు కొత్తకోట లక్ష్మయ్య గణపురం మండల అధ్యక్షులు దేవరకొండ గోపాల్ ఉప్పరపల్లి గ్రామ అధ్యక్షులు రాములు తదితరులు పాల్గొన్నారు.





