Saturday, March 21, 2026

ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా సోమవారం రోజున కడుకుంట్ల గ్రామంలో శివాజీ చౌక్ వద్ద నవభారత్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగినది. దాదాపు 40 మంది యువకులు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేయడం జరిగింది. శివాజీ యూత్ ఆధ్వర్యంలో శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ విగ్రహానికి వనపర్తి రూరల్ ఎస్సై జలంధర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు, ఎస్సై మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణకు శివాజీ మహారాజ్ చేసిన సేవలు ఎనలేనివని తన రాజ్యంలోని ఆడవాళ్ల అందరిని మరియు తన శత్రురాజ్య స్త్రీలను తన తోబుట్టువులుగా భావించి పసుపు, కుంకుమ, చీరలు ఇచ్చేవారని అలాంటి ధీరుడు భరతఖండంలో జన్మించడం మన అదృష్టంగా భావించాలని ఎస్సై అన్నారు. దేశంలో అత్యధిక విగ్రహాలు కలిగిన మహారాజు శివాజీ ఒక్కరేనని ఎస్సై జలంధర్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలోనవభారత్ అసోసియేషన్ అధ్యక్షుడు గొల్ల సురేష్,తెలుగు విష్ణు,జీ తిరుపతయ్య గౌడ్,బుచ్చిరెడ్డి పి ఈ టి,నిరంజన్ గౌడ్, శివ, నవీన్ సాగర్,రమేష్,పాఠశాల విద్యార్థులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News