
నేటి సాక్షి, గోదావరిఖని (రమేష్) : 8 ఇంక్లైన్ కాలనీ బుధవారం రోజున చత్రపతి శివాజీ మహారాజ్ 396 జయంతి వేడుకలను రామంచ శ్రావణ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించడం జరిగినది. కార్యక్రమం హనుమాన్ నగర్ లోని హనుమాన్ టెంపుల్ నుండి ఎనిమిదవ కాలనీ పూర్వీదుల గుండా శోభాయాత్ర శోభానయంగా ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. పలువురు వక్తలు మాట్లాడుతూ.. చత్రపతి శివాజీ యొక్క జీవిత చరిత్రను వివరించడం జరిగింది. మరియు శివాజీ అడుగుజాడల్లో నడవాలని ప్రతి ఒక్క యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన మహా గొప్ప యోధుడని కొనియాడారు కార్యక్రమంలో బజరంగ్దళ్ అధ్యక్షులు తిరుపతి, తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రావుల రాజేష్ యాదవ్ వైకే ఫౌండేషన్ వ్యవస్థాపక కులు కండే సురేష్ కుమార్, సాయి ఆకుల సాయి కుమార్, జితేంద్ర, నవీన్, సందీప్, కిరణ్ తేజ, ప్రవీణ్ అనిల్ శీను రవికుమార్ శివ హిందూ అనుబంధ సంస్థ నాయకులు మరియు యువత పాల్గొన్నారు.





