- ఆర్టీసీ రిటైర్మెంట్ ఉద్యోగుల, పర్యావరణ పరిరక్షణల కమిటీ
నేటి సాక్షి, హుజూరాబాద్, ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు): హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక అధికారికి ఆర్టీసీ రిటైర్మెంట్ ఉద్యోగుల మరియు ప్లాస్టిక్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఆర్టీసీ ఉద్యోగులకు తెల్ల రేషన్ కార్డులు మరియు ఆసరా పెన్షన్స్, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. హుజురాబాద్ పట్టణంలో ప్లాస్టిక్ ను వినియోగించి ప్రజలు అనారోగ్యంకు గురై క్యాన్సర్ బారిన పడకుండా నియంత్రించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్త చట్టాలను అమలు పరచాలని కోరడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మార్త రవీందర్, వేల్పుల ప్రభాకర్, ఈవిఆర్ నరసయ్య, ఆర్ఆర్ పతి, బత్తిని సంజీవ్, ఎం రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.





