- నేర శాతం తగ్గింపుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలి
- సమర్థవంతమైన పోలీసు వ్యవస్థలో పని చేస్తున్నం, ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో లో ఉండాలి
- ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్
నేటి సాక్షి, మహబూబాద్ నరసింహ పేట భూక్యా రవి : మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ మహబూబాబాద్ జిల్లా పరిధిలోని పోలీస్ అధికారులతో మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంబంధిత పోలీస్ స్టేషన్ వారీగా నేర నియంత్రణ, కేసుల విచారణ తీరు, శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న ప్రత్యేక చర్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో వారికి ఎదురవుతున్న సమస్యలను కూలంకషంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి పలు విలువైన సూచనలు ఇచ్చారు. అనంతరం ఉత్తమప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రోత్సహకాలు అందజేసారు.





