Sunday, March 22, 2026

ఆర్.ఎఫ్.సి.ఎల్ లో నూతన కార్మిక సంఘం ఆవిర్భావం

నేటి సాక్షి గోదావరిఖని (రమేష్) : బుధవారం స్థానిక దుర్గా నగర్లోని లక్ష్మీప్రసన్న గార్డెన్ లో ఉదయం 10 గంటలకు రామగుండం ఫెర్టిలైజర్ కెమికల్ లిమిటెడ్ ఆర్.ఎఫ్.సి.ఎల్ కాంట్రాక్టు కార్మిక సంఘం ఏకగ్రీవంగా 250 మంది కార్మికుల సంతకాలతో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. కమిటీ అధ్యక్షుడు గా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్. ఏకగ్రీవంగా ఎన్నుకోగా, కమిటీ అధ్యక్షునిగా నెలికంటి రాము ఎన్నుకోవడం జరిగింది. మిగతా కమిటీని ఆర్.ఎఫ్.సి.ఎల్ కార్మికుల విభాగాల కంపెనీ చుట్టుప్రక్కల గ్రామాల రామగుండం మున్సిపల్ కార్పొరేషనుకు సంబంధించిన తాజా మాజీ ప్రజాప్రతినిధులతో పాటు పూర్తి స్థాయిలో కమిటీని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. సమక్షంలో ఎన్నుకొని ప్రకటించడం జరిగింది. ఎన్నిక కార్యక్రమంలో ఎల్కలపల్లి మాజీ సర్పంచ్ చిట్టబోయిన రాజ్ కుమార్, మాజీ కార్పొరేటర్ కందుల సతీష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బూర్ల శ్రీను, కన్నూరి శంకర్, దబ్బెట మల్లేష్, ఎరుకల అంజి, రమేష్ రెడ్డి, ధాతు శ్రీను, దూస రాజేష్, జనగామ శ్రీనాధ్. డి.సందీప్, పన్నాల శ్రీను.
మట్టపల్లి సంజీవ్, పెంచాల తరుణ్ లతో పాటు దాదాపుగా 250 మంది ఆర్ ఎఫ్ సి ఎల్ కార్మికులు పాల్గొనడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News