Sunday, March 22, 2026

రాయినిపేట రాయసముద్రం చెరువుకు సంబంధించి అన్ని రికార్డులు పరిశీలన

  • రికార్డులు పరిశీలన తర్వాత లోకాయుక్తకు పూర్తి నివేదిక సమర్పించాలి
  • జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి

నేటి సాక్షి, ప్రతినిధి వనపర్తి జిల్లా : కొత్తకోట మండల పరిధిలోని రాయినిపేట చెరువు నీటి వల్ల తమ భూములు మునుగుతున్నాయని, మునిగిన తమ భూములకు ప్రభుత్వ నష్టపరిహారం చెల్లించాలంటూ చెరువు ఆయకట్టు రైతులు ఇదివరకు లోకాయుక్తలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో లోకయుక్త కు నివేదిక సమర్పించడం కొరకు జిల్లా కలెక్టర్ గురువారం నాడు అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ సూపరిండెంట్ ఇంజనీర్ శ్రీనివాస్, ఆర్డీవో సుబ్రహ్మణ్యంతో కలిసి చెరువు పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అక్కడికి వచ్చిన రాయిని పేట, వనపర్తి మండలంలోని కడుకుంట్ల గ్రామాల రైతులతో మాట్లాడి, పరిస్థితులను తెలుసు కున్నారు. చెరువు నీటి వల్ల మునుగుతున్న తమ భూముల సమస్య గురించి రైతులు కలెక్టర్ కు విన్నవించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని రికార్డులు పరిశీలించిన అనంతరం లోకాయుక్తకు పూర్తి నివేదిక సమర్పించడం జరుగుతుందని తెలిపారు. ఇరిగేషన్ సూపరిండెంట్ ఇంజనీర్ శ్రీనివాస్, వనపర్తి తాసిల్దార్ రమేష్ రెడ్డి, కొత్తకోట తహసిల్దార్ శ్రీనివాసులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News