నేటి సాక్షి, మందమర్రి:- పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని ఊరు మందమర్రి గ్రామానికి చెందిన మల్యాల తిరుపతి కుటుంబానికి ఆటో కార్మిక సేవ సమితి అండగా నిలిచింది. గురువారం తిరుపతి స్వగృహంలో సేవా సమితి చైర్మన్ నేరేళ్ల వెంకటేష్ ఆధ్వర్యంలో తిరుపతి కుటుంబ సభ్యులకు 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా సేవా సమితి చైర్మన్ నేరేళ్ల వెంకటేష్ మాట్లాడుతూ, గత 20 రోజుల క్రితం మల్యాల తిరుపతి అకాల మరణం చెందటంతో వారి కుటుంబం జీవనం ఉపాధిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి వైస్ చైర్మన్ భూకాల సంతోష్, కోశాధికారులు చొప్పరి లక్ష్మీనారాయణ, బొల్లు రవి, డైరెక్టర్లు బత్తిని రాజేష్, ఆకుల శ్రీనివాస్, గోశిక ప్రభాకర్, ఎండి ఇన్నుస్, నందిపాటి రవి, ఎగ్జిక్యూటివ్ సభ్యులు రెడ్డి ఐలయ్య, ఎనగందుల శ్రీనివాస్, కొంగ మల్లేష్, ఆవునూరి రాంబాబు, ఆవునూరి నాగరాజు లు పాల్గొన్నారు.





