నేటిసాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్): వ్యవసాయ శాఖ, కరీంనగర్ రైతు శిక్షణా కేంద్రం ఆత్మ ఆధ్వర్యంలో డిప్లమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్పుట్ డీలర్స్, ఒక సంవత్సరం కోర్సులో గన్నేరువరం మండలానికి చెందిన డీలర్స్ సందవేని ప్రశాంత్, బద్దం మహిపాల్ రెడ్డి, ఖాసీంపేట శిక్షణ తీసుకుంటున్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా గన్నేరువరం మండలంలోని వివిధ పంటలపై వరి మరియు మొక్కజొన్న పంటలో ఆశించిన పురుగు మరియు తెగులు పై క్షేత్ర సందర్శన నిర్వహించడం జరిగింది. ఖాసీంపేట్ గ్రామంలో మహిపాల్ రెడ్డి రైతు సాగు చేసిన బొప్పాయి పంటను సందర్శించి చీడపురుగులపై డీలర్లకు డేసి ఫెసిలిటేటర్ రామచంద్రరావు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మాజీ జెడ్పిటిసి మన్మోహన్ రావు, గన్నేరువరం మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి,రైతు శిక్షణ కేంద్రం వ్యవసాయ అధికారి మమత, ఆత్మ (బిటిఎం) స్రవంతి,శిక్షణ డీలర్స్ పాల్గొన్నారు.





